Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'అవి ఫేక్ వీడియోలు'.. స్విమ్మింగ్ పూల్ ఫొటోలపై రుక్మిణి వసంత్ ఆగ్రహం

'అవి ఫేక్ వీడియోలు'.. స్విమ్మింగ్ పూల్ ఫొటోలపై రుక్మిణి వసంత్ ఆగ్రహం

వార్త 1 day ago

Rukmini Vasanth: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న తన లీక్డ్ బికినీ విజువల్స్‌పై కన్నడ బ్యూటీ, రుక్మిణి వసంత్ స్పందించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలు పూర్తిగా నకిలీవని, ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించినవని ఆమె స్పష్టం చేశారు.

ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ, సదరు కంటెంట్‌ను క్రియేట్ చేసిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Aishwarya Rai Cannes 2026: నీలిరంగు గౌనులో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఐశ్వర్య రాయ్!

Rukmini Vasanth: చట్టపరమైన చర్యలకు సిద్ధం

తాను బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్నట్లుగా చూపిస్తున్న వీడియోలు తనవి కావని రుక్మిణి వసంత్ తేల్చి చెప్పారు. “ఇలాంటి నకిలీ కంటెంట్‌ను సృష్టించడం, దానిని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ఇది ఒక వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రైవసీని తీవ్రంగా ఉల్లంఘించడమే” అని ఆమె మండిపడ్డారు. ఇటువంటి ఫేక్ కంటెంట్‌ను ఎవరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని, పోస్టులు పెట్టవద్దని ఆమె నెటిజన్లను, అభిమానులను కోరారు.

ఈ డీప్‌ఫేక్ కారణమైన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు రుక్మిణి వసంత్ ప్రకటించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ నకిలీ వీడియోలను తయారు చేసిన వ్యక్తులపై, అలాగే వాటిని వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా స్పష్టం చేశారు.

ప్రస్తుతం రుక్మిణి వసంత్ టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ చిత్రమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' (Dragon) సినిమాలో నాయికగా నటిస్తోంది. రుక్మిణి వసంత్ స్వయంగా ఈ వివాదంపై స్పందించి, అది డీప్‌ఫేక్ అని క్లారిటీ ఇవ్వడంతో గత కొన్ని గంటలుగా నడుస్తున్న సస్పెన్స్‌కు తెరపడింది. సినిమా ఇండస్ట్రీలో వరుసగా హీరోయిన్లు ఇలా ఏఐ సాంకేతికతకు బలికావడంపై చిత్ర పరిశ్రమ వర్గాల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అక్కినేని అఖిల్ 'లెనిన్' టీజర్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha