Ayodhya Mandir Donation Theft : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ముపై కొందరు కేటుగాళ్లు కన్నేశారు.
మందిర ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలను చోరీ చేసి, ఆ డబ్బుతో గుట్టుచప్పుడు కాకుండా వడ్డీ వ్యాపారం, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను అయోధ్య ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు మట్టుబెట్టారు. విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. తాజాగా కీలక నిందితుల ఇళ్లపై మెరుపు దాడులు నిర్వహించి షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
Read Also:Ayodhya Donation : అయోధ్యలో రూ.5 కోట్ల విలువైన బంగారు పుస్తకం మిస్సింగ్?
ఇళ్లపై దాడులు.. డబ్బుల కట్టలు, కారు స్వాధీనం

ఈ విరాళాల చోరీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేల ఇళ్లే లక్ష్యంగా సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నిందితుల నివాసాల నుండి భారీగా డబ్బుల కట్టలు, లక్షల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నేరానికి ఉపయోగించిన, విరాళాల సొమ్ముతో కొనుగోలు చేసిన ఒక లగ్జరీ కారును కూడా సీజ్ చేశారు.
చోరీ సొమ్ముతో వడ్డీ వ్యాపారం.. షేర్ మార్కెట్ పెట్టుబడులు
నిందితులు మందిర నిధులను కేవలం దాచుకోకుండా, వాటి ద్వారా మరింత సంపాదించేందుకు పక్కా ప్లాన్ వేశారని విచారణలో తేలింది. భక్తులు భక్తితో ఇచ్చిన విరాళాల నగదును స్థానికంగా భారీ వడ్డీలకు తిప్పినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. మార్కెట్ ఒడిదుడుకులను ఆసరాగా చేసుకుని విరాళాల డబ్బును స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో మరియు షేర్లలో ఇన్వెస్ట్ చేసినట్లు సిట్ (SIT) నిర్ధారించింది.
Ayodhya Mandir Donation Theft:బంధువుల అకౌంట్లలోకి నిధులు.. 30 ఖాతాలు ఫ్రీజ్
ట్రస్ట్ నుండి తస్కరించిన సొమ్మును నేరుగా తమ అకౌంట్లలో వేసుకుంటే దొరికిపోతామనే భయంతో నిందితులు తమ బంధువుల బ్యాంకు ఖాతాలను వాడుకున్నారు. నిందితుల బంధువులకు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లోకి ఇటీవలి కాలంలో అసాధారణంగా, భారీ మొత్తంలో నగదు జమైనట్లు బ్యాంకింగ్ లావాదేవీల తనిఖీల్లో వెల్లడైంది. తదుపరి అక్రమ లావాదేవీలు జరగకుండా అప్రమత్తమైన దర్యాప్తు అధికారులు.. నిందితులు, వారి బంధువులకు చెందిన దాదాపు 30 బ్యాంకు ఖాతాలను తక్షణమే జప్తు (Freeze) చేశారు. ఈ కుంభకోణంలో మందిర ట్రస్ట్‌కు చెందిన మరికొందరు అంతర్గత వ్యక్తుల హస్తం ఉందా? అనే కోణంలో సిట్ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. పవిత్రమైన అయోధ్య మందిర విరాళాల సొమ్ముతో వడ్డీ దందాకు పాల్పడటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

