Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయోధ్యలో రూ.5 కోట్ల విలువైన బంగారు పుస్తకం మిస్సింగ్?

అయోధ్యలో రూ.5 కోట్ల విలువైన బంగారు పుస్తకం మిస్సింగ్?

వార్త 1 month ago

Ayodhya Donation : అయోధ్యలోని భవ్య రామమందిరానికి అందిన ఒక అరుదైన, అత్యంత విలువైన విరాళం కనిపించకుండా పోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ ఎస్. లక్ష్మీనారాయణ తాను అయోధ్య రామమందిర ట్రస్టుకు విరాళంగా సమర్పించిన 'రామచరితమానస్' పుస్తకం మాయమైందని సంచలన ఆరోపణలు చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన, బంగారు పూత పూసిన ఈ పవిత్ర గ్రంథాన్ని ఆయన 2024 ఏప్రిల్ నెలలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. అయితే, ఈ భారీ విరాళానికి సంబంధించి ట్రస్ట్ నిర్వాహకులు తనకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక రశీదు (Receipt) కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో భద్రత, పారదర్శకతపై ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.

 Ram Mandir Donation Case

ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌దే బాధ్యత

ఈ వివాదంపై లక్ష్మీనారాయణ మరింత లోతుగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము విరాళంగా ఇచ్చిన ఆ బంగారు పుస్తకం ప్రారంభంలో ఒక మూడు, నాలుగు నెలల పాటు ఆలయ ప్రాంగణంలో అందరికీ కనిపించిందని, కానీ ఆ తర్వాత కాలంలో అది అకస్మాత్తుగా అక్కడ నుంచి మాయమైందని, ప్రస్తుతం దాని ఆచూకీ ఎక్కడా లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించిన కానుకల భద్రత లోపించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి, పుస్తకం మాయమవడానికి శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ పూర్తి బాధ్యత వహించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ ఘటన అయోధ్య ట్రస్ట్ నిర్వహణ తీరుపై సరికొత్త చర్చకు దారితీసింది.

ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha