Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాబా రామ్‌దేవ్‌తో కలిసి ముఖ్యమంత్రి యోగా సాధన

బాబా రామ్‌దేవ్‌తో కలిసి ముఖ్యమంత్రి యోగా సాధన

వార్త 2 weeks ago

Chandrababu Naidu Yoga: ప్రస్తుత ఆధునిక సమాజంలో యువత విపరీతమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, దానికి యోగా ఒక్కటే సరైన పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉండవల్లి కొండల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పతంజలి యోగపీఠ్ వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు వేశారు. రామ్‌దేవ్ బాబా శిక్షణలో జరిగిన ఈ యోగా సాధనను ఆయన ప్రత్యేకంగా తిలకించారు. యోగా అనేది మన పూర్వీకులు అందించిన సాంప్రదాయం, విజ్ఞానం మరియు అమూల్యమైన వారసత్వ సంపద అని సీఎం కొనియాడారు.

Read Also :Droupadi Murmu Vizag Visit:వైజాగ్ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Chandrababu Naidu Yoga: ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తాం

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి (UN) ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుర్తించిందని, నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా సమాజానికి అంతే అవసరమని, రాబోయే రోజుల్లో ఏపీని దేశానికే ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా (Spiritual Hub) తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అలాగే రాజధాని అమరావతి కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దపీట వేస్తున్నామని, ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో రైతులు సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారని సీఎం వెల్లడించారు.

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు.. ఏపీ ఒక దేవభూమి: బాబా రామ్‌దేవ్

 He announced plans to transform Andhra Pradesh into the country’s spiritual hub.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన, విజన్ ఉన్న అగ్రనేత అని యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రశంసించారు. గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే తాము పనులు చేస్తున్నామని తెలిపారు. అమరావతి అనేది కేవలం రాజధాని మాత్రమే కాదు, అది ‘దేవతల రాజధాని’ అని రామ్‌దేవ్ అభివర్ణించారు. భవిష్యత్తులో ఇక్కడ 40 శాతం పచ్చదనం, 60 శాతం అత్యాధునిక నిర్మాణాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఒక పవిత్రమైన దేవభూమి అని కొనియాడిన ఆయన.. ప్రకృతి అందాల కోసం స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అవసరం లేదని, ఏపీకి వస్తే చాలని అన్నారు. ఇక్కడి మామిడి, అరటి పండ్లు సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండటం వల్ల ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. కాగా, ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ (Yoga for Healthy Aging) అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు బాబా రామ్‌దేవ్ వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'అన్నదాత సుఖీభవ' నిధుల విడుదల!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha