Patanjali Products Seize: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన 'పతంజలి' బ్రాండ్ ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గట్టి షాక్ ఇచ్చింది.
వివిధ రోగాలను పూర్తిగా నివారిస్తామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అభ్యంతరకరమైన ప్రకటనలు జారీ చేస్తున్నారనే ఆరోపణలతో ఎఫ్‌డీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ స్టాక్‌లో పతంజలి బ్రాండ్ ఉత్పత్తులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Misleading Advertisements Case
Read also: Top in the use of 'AI' : 'AI' వాడకంలో మనోళ్లే టాప్! కానీ.. మనసులో లేఆఫ్స్ భయాలు!
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం కింద చర్యలు.. ఏకకాలంలో దాడులు!
ప్రజలను భ్రమల్లోకి నెట్టే ప్రకటనలను అరికట్టే ‘డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం’ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. మహారాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముంబై, కొంకణ్, పుణె, నాసిక్, అమరావతి, నాగ్‌పుర్, ఛత్రపతి శంభాజీనగర్ వంటి కీలక డివిజన్లలో అధికారులు ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు.
Patanjali Products Seize: దివ్య ఫార్మసీ ప్రొడక్ట్స్ టార్గెట్.. ఎఫ్‌డీఏ సీరియస్ వార్నింగ్
హరిద్వార్‌లోని ‘దివ్య ఫార్మసీ’ సంస్థ తయారు చేసి, పతంజలి బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్న ఔషధాలను ఈ దాడుల్లో ప్రధానంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే.. నాగ్‌పూర్ డివిజన్‌లో రూ.7,26,755 విలువైన మందులను, నాసిక్ డివిజన్‌లో రూ.7,10,945 విలువైన స్టాక్‌ను అధికారులు సీజ్ చేశారు. నకిలీ, తప్పుడు మరియు అతిశయోక్తి ప్రకటనలతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే సంస్థలపై భవిష్యత్తులోనూ కఠినంగా వ్యవహరిస్తామని ఎఫ్‌డీఏ అధికారులు హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
read also:
మైనర్‌బాలికపై లైంగిక దాడి.. అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

