Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైనర్‌బాలికపై లైంగిక దాడి.. అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

మైనర్‌బాలికపై లైంగిక దాడి.. అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

వార్త 0 months ago

Gujarat Crime: అమెరికాలో అత్యంత దారుణమైన నేరానికి పాల్పడిన ఒక భారతీయ వ్యక్తికి అక్కడి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. హ్యూమన్ ట్రాఫికర్లకు డబ్బు చెల్లించి, ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 27 ఏళ్ల కవన్ కుమార్ పటేల్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.

గుజరాత్‌కు చెందిన పటేల్, నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహా నగరంలో గల ఒక హోటల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

Read Also: Guntur GGH Suicide: ఆసుపత్రి భవనంపై నుంచి దూకి కిడ్నీ రోగి ఆత్మహత్య!

 Gujarati youth sentenced to 10 years in prison in America

Gujarat Crime: దొంగతనం కేసు విచారణలో వెలుగుచూసిన సెక్స్ రాకెట్

ఈ దారుణమైన కేసు నేపథ్యం పరిశీలిస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవుతాయి. 2025 జనవరి 6న ఒమాహాలోని ‘అమెరిక్‌ఇన్’ హోటల్‌లో జరిగిన ఒక దొంగతనం కేసుపై విచారణ జరిపేందుకు స్థానిక పోలీసులు వెళ్లారు. అక్కడ తనిఖీలు చేస్తున్న క్రమంలో కమర్షియల్ సెక్స్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో రంగంలోకి దిగిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్, ఒమాహా పోలీసులు సంయుక్తంగా భారీ దర్యాప్తు చేపట్టారు. ఈ తనిఖీల్లో వాణిజ్యపరమైన లైంగిక కార్యకలాపాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించిన 15, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలికలను అధికారులు సురక్షితంగా రక్షించారు.

రూమ్ రెంట్ కోసం చిన్నారులపై ఒత్తిడి..

బాధితులైన మైనర్ బాలికలను అధికారులు విచారించగా నిజాలు బయటపడ్డాయి. హోటల్ గది అద్దె తగ్గించుకోవాలంటే హోటల్ సిబ్బందితో లైంగికంగా కలవాలని, లేకపోతే హోటల్ నుంచి బయటకు గెంటేస్తామని ట్రాఫికర్లు తమను బెదిరించారని ఆ చిన్నారులు రోదిస్తూ చెప్పారు. ఈ క్రమంలోనే హోటల్ ఉద్యోగి అయిన కవన్ కుమార్ పటేల్, మైనర్ బాలికతో దారుణానికి ఒడిగట్టేందుకు ట్రాఫికర్లకు హోటల్ కౌంటర్ డ్రాయర్‌లోని డబ్బును చెల్లించినట్లు కోర్టు ముందు అంగీకరించాడు. పటేల్‌తో పాటు మరో ఇద్దరు హోటల్ ఉద్యోగులు కూడా ఈ దారుణానికి పాల్పడినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ అక్రమ రవాణాకు పాల్పడిన ప్రధాన సూత్రధారులు ఎడ్వర్డో జోస్ పెర్డోమో, మిచెల్ మార్టినెజ్-గొంజాలెజ్, అల్ఫ్రెడో జంబ్రానో-హర్టాడోలతో పాటు పటేల్ సహోద్యోగులైన సుమిత్ చౌధరి, విశాల్ గోస్వామి అనే మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులపై కూడా అమెరికా అధికారులు తీవ్రమైన అభియోగాలు మోపారు. కనీసం తినడానికి ఆహారం కూడా ఇవ్వకుండా ఆ బాలికలను రోజుల తరబడి హోటల్‌ గదుల్లోనే బంధించి, ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తూ విటులను ఏర్పాటు చేసేవారని దర్యాప్తులో తేలింది. నరక కూపం లాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఆ అమాయక చిన్నారులను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ సకాలంలో రక్షించింది” అని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ లెస్లీ వుడ్స్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా (ఇల్లీగల్‌గా) నివసిస్తున్న నిందితుడు కవన్ కుమార్ పటేల్, అక్కడ కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న తర్వాత అతడిని అమెరికా దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించనున్నట్లు (డిపోర్ట్) అక్కడి ఉన్నతాధికారులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భార్య వేధింపులు తట్టుకోలేక.. కారుణ్య మరణం కోరిన భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha