Telangana ranks first in crimes : రోజుకు సగటున 108 ఆర్థిక నేరాలు నమోదవుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 గణాంకాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న వాటిలో 18 శాతం తెలంగాణలోనే నమోదవుతున్నట్లు ఈ నివేదికలో తేలింది. మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణలో అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్న కారణంగా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు ఎక్కువగా ఉండటం దీనికి ఓ కారణంగా చెప్పవచ్చు. ప్రజల్లో ఉన్న ‘ఆశ’ను నేరగాళ్లు క్యాష్ చేసుకుంటూ.. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, దేశంలో 2024లో 2,14,379 ఆర్థిక నేరాలు జరిగాయి. ఇందులో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో అత్యధికంగా 39,127 ఆర్థిక నేరాలు రికార్డ్ అయ్యాయి. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలోనే ఎక్కువగా ఆర్థిక నేరాలు రిపోర్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు. ”మోసపోయిన మొత్తం రూ.2 కోట్లకు పైబడి ఉంటేనే ఆర్థిక నేరాల విభాగం వద్ద రిపోర్ట్ అవుతున్నాయి. సైబరాబాద్‌లో రూ.3 కోట్లకు పైబడిన కేసులు రిపోర్ట్ అవుతుంటాయి. అంతకన్నా తక్కువ మొత్తంలో ఉంటే, అలాంటి నేరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు రిఫర్ చేస్తున్నాం” అని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ పరిధిలో రూ.75 లక్షలకు మించిన మోసాల్లో ఆర్థిక నేరాల విభాగం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Read Also: Shadnagar crime: ప్రియుడి మోజులో కన్నపిల్లలను వేడి నూనెతో కాల్చిన కసాయి తల్లి
Telangana ranks first in crimes
ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులే ఎక్కువ
ఆర్థిక నేరాల్లో ఎక్కువగా ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులే రిపోర్ట్ అవుతున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. ”మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో.. ముందుగా బాధితులు కొంతమొత్తం పెట్టుబడి పెడుతున్నారు. దానిపై ఎంతో కొంత లాభం గడిస్తున్నారు. తర్వాత ఇంకొంత పెట్టుబడి పెడుతున్నారు. దానికీ లాభం వస్తోంది. మోసగాళ్లు అలా వారిని నమ్మించిన తర్వాత ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టమని చెబుతున్నారు. పెట్టిన వెంటనే నిందితులు బోర్డు తిప్పేయడం లేదా డబ్బుతో ఉడాయించడం జరుగుతోంది. అప్పుడు మోసపోయామని బాధితులు గ్రహిస్తున్నారు. పెట్టుబడికి తగ్గట్టుగా కాకుండా ఎక్కువగా లాభాలు ఇస్తున్నారంటేనే అనుమానించి, డబ్బులు పెట్టకపోతే మోసపోకుండా ఉండేందుకు వీలుంటుంది” అని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఆర్థిక నేరాల్లో ఛార్జి షీట్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. 2024లో ఛార్జి షీటు రేటు 39.8 శాతంగా ఉంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఛార్జి షీటు రేటు 53.3 శాతంగా ఉంది.
Epaper: epaper.vaartha.com

