Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాబోయ్ భయపెడుతున్న సూపర్ ఎల్ నినో..వేడిగాలులతో సతమతం

బాబోయ్ భయపెడుతున్న సూపర్ ఎల్ నినో..వేడిగాలులతో సతమతం

వార్త 3 months ago

సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న ఏకైక అంశం ఏదైనా ఉందంటే అది 'సూపర్ ఎల్ నినో' (Super El Niño). భారతదేశంపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2026లో సూపర్ ఎల్ నినో రికార్డు స్థాయిలో వేడిని తీసుకురావచ్చని ఐఎమ్‌డి హెచ్చరించింది. ఇంతకీ ఎల్ నినో అంటే ఏమిటి.. ఎందుకు ఇంతలా కలవరపెడుతోంది. భారత్ లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఓ సారి చూద్దాం. ఎల్ నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల సంభవించే ఒక సహజ వాతావరణ పరిణామంగా చెప్పవచ్చు. ఈ సముద్ర ఉష్ణోగ్రతల మార్పు ప్రపంచవ్యాప్త వాతావరణ సరళిని మార్చేస్తుంది. స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే ‘చిన్న బిడ్డ’ అని అర్థం.

Read Also: CM Vijay: విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారుల గుట్టు చెప్తే లక్ష రూపాయల బహుమతి

 Super El Nino is scaring

Super El Nino: “సూపర్ ఎల్ నినో” అంటే?

కొన్ని శతాబ్దాల క్రితం పెరూ దేశపు జాలర్లు క్రిస్మస్ సమయంలో సముద్రపు నీరు వేడెక్కడాన్ని గమనించి ఈ పేరు పెట్టారు. సాధారణంగా ఇది ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవించి, దాదాపు ఏడాది పాటు కొనసాగుతుంది. సముద్రపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా పెరిగినప్పుడు దానిని “సూపర్ ఎల్ నినో”గా పరిగణిస్తారు. ఇది సాధారణ ఎల్ నినో కంటే తీవ్రమైన కరువులు, వరదలు, కార్చిచ్చులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది. 2026లో ఎల్ నినో వేగంగా బలపడుతోందని అమెరికాకు చెందిన నోవా (NOAA) హెచ్చరించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది ‘చాలా బలంగా’ మారడానికి మూడింట రెండు వంతుల అవకాశం ఉంది. ఈసారి ‘లా నినా’ నుండి ‘ఎల్ నినో’కు పరివర్తన చాలా వేగంగా జరగడం, భూతాపం తోడు కావడం వల్ల ఆందోళన మరింత పెరిగింది. 1951 నుండి 2022 మధ్య ఎల్ నినో వచ్చిన సంవత్సరాలలో 60 శాతం కాలం దేశంలో తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈసారి కూడా రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నాడు 'విద్యార్థులకు న్యాయం' నినాదాలు.. నేడు నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha