Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారుల గుట్టు చెప్తే లక్ష రూపాయల బహుమతి

విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారుల గుట్టు చెప్తే లక్ష రూపాయల బహుమతి

వార్త 4 days ago

CM Vijay: తమిళనాడులో అవినీతిని అంతమొందించడానికి టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఒక సంచలన పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకునే అధికారుల సమాచారాన్ని ఆధారాలతో సహా అందిస్తే రూ.

లక్ష బహుమతి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో పేరుకుపోయిన లంచగొండితనాన్ని వేళ్లతో సహా పాతరేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించారు.

Read also: Medical shops strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్!

 cm vijay corruption free tamil nadu

చిన్న లంచమైనా సరే భారీ నజరానా

ఈ పథకం కింద కేవలం పెద్ద మొత్తంలో జరిగే అవినీతి మాత్రమే కాకుండా చిన్న చిన్న లంచాలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం రూ. వెయ్యి లంచం డిమాండ్ చేసినా, ఆ విషయమై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే సదరు పౌరుడికి రూ. లక్ష నగదు బహుమతి అందుతుంది. ఈ వినూత్న ఆలోచనతో లంచం అడగాలంటేనే అధికారులు వణికిపోయే పరిస్థితి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

CM Vijay: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్

ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రకటనతో అటు ప్రభుత్వ యంత్రాంగంలో అలజడి మొదలవ్వగా, ఇటు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. అవినీతి రహిత పాలన అందించడానికి ఈ అడుగు ఎంతగానో ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha