Karuppu movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' తెలుగులో వీరభద్రుడు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది.
సూర్య గత చిత్రాలైన ‘కంగువా’, ‘రెట్రో’ ఆశించిన విజయాలు అందుకోకపోవడంతో, ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఆయన కరుప్పుపై పూర్తి ఫోకస్ పెట్టారు. మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్ జే బాలజీ దర్శకత్వం వహించారు. సూర్య సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటించగా.. యోగి బాబు, నట్టి సుబ్రహ్మణ్యం కీలక పాత్రలు పోషించారు. సాయి అభయంకర్ సంగీతం, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాను దాదాపు రూ. 130 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు.
ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగానూ ఈ సినిమా సాలిడ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఓటీటీ హక్కులు సుమారు రూ. 35 కోట్లకు అమ్ముడుపోగా, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకే విక్రయమయ్యాయి. థియేట్రికల్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 110 కోట్ల బిజినెస్ జరగడంతో.. ఈ సినిమా క్లీన్ హిట్ (బ్రేక్ ఈవెన్) స్టేటస్ అందుకోవాలంటే కనీసం రూ. 115 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.
Read Also: Tamannaah: లవ్ లెక్చర్స్ ఇస్తున్న మిల్కీ బ్యూటీ.. ఆ మాటల వెనుక ఆంతర్యమేంటి?
Box office collection hunt.. What are the collections of the movie ‘Karuppu’?
Karuppu movie: ఫస్ట్ డే అదరగొట్టి.. రెండో రోజు అదే జోరును చూపిస్తున్న ‘కరుప్పు’
ఇండియాలో మొదటి రోజు 4,891 షోల ద్వారా రూ. 14.40 కోట్ల నెట్ వసూళ్లు (గ్రాస్ రూ. 16.66 కోట్లు) సాధించింది. ఓవర్సీస్ నుంచి మరో రూ. 4 కోట్లు రావడంతో.. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 20.66 కోట్ల మార్కును దాటి సూర్య కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. రీజియన్ల వారీగా చూస్తే.. మొదటి రోజు తమిళనాడులో రూ. 10.50 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) రూ. 2.75 కోట్లు, కర్ణాటకలో రూ. 2 కోట్లు, కేరళలో రూ. 1.25 కోట్లు నమోదయ్యాయి.
ఇక రెండో రోజు (శనివారం) కలెక్షన్ల విషయానికి వస్తే.. మార్నింగ్ షోల నుంచే థియేటర్లలో ఆక్యుపెన్సీ మరింత పెరిగింది. ట్రేడ్ వర్గాల లైవ్ ట్రాకింగ్ అంచనాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సమయానికే ఇండియా వైడ్ రూ. 8 కోట్ల మార్కును దాటేసి, సాయంత్రం, నైట్ షోల బుకింగ్స్‌తో మరింత దూకుడు చూపిస్తోంది. వీకెండ్ కావడంతో రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగి, శనివారం నాటికి ఇండియా వైడ్ గ్రాస్ రూ. 25 కోట్ల మార్కును ఈజీగా దాటే దిశగా దూసుకుపోతోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా సూర్యకు ఎలాంటి కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

