Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పెద్ది.. ట్విట్టర్ టాక్ వైరల్

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పెద్ది.. ట్విట్టర్ టాక్ వైరల్

వార్త 2 weeks ago

Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్ షోలు పూర్తికాగా, సోషల్ మీడియాలో సినిమా గురించి అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ట్విట్టర్‌లో సినిమా గురించి ప్రశంసలు, విమర్శలు రెండూ కనిపిస్తున్నాయి.

రామ్ చరణ్ నటనపై ప్రశంసలు

సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నారని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే యాక్షన్ సన్నివేశాలు, ట్విస్ట్‌లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ట్వీట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ కొత్త లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించిందని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, పాటలు, మాస్ డాన్స్ మూమెంట్స్‌కు మంచి స్పందన లభిస్తోంది.

Read also: Dance Master Pandu Accident: పండు మాస్టర్ కాళ్లకు ఆపరేషన్ తప్పనిసరి అంటున్న వైద్యులు!

సెకండాఫ్‌లో పెరిగిన ఆసక్తి

ఫస్టాఫ్‌లో ప్రేమకథ భాగం అంతగా ప్రభావం చూపలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల కథనం (Peddi Movie Review) నెమ్మదిగా సాగిందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సెకండాఫ్‌లో కథ ఢిల్లీ నేపథ్యంలో సాగుతూ మరింత ఆసక్తికరంగా మారిందని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు, నైట్ క్రికెట్ మ్యాచ్, పహిల్వాన్ ఫైట్ ఎపిసోడ్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసిస్తున్నారు.

మిశ్రమ స్పందన పొందిన సినిమా

క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటన భావోద్వేగంగా ఉంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమా మొత్తాన్ని ఆయన తన భుజాలపై మోశారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు బలంగా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా నిడివి ఎక్కువగా ఉందని, కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విజువల్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయని చెబుతుండగా, మరికొందరు మాత్రం కథనం రొటీన్‌గా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఫ్యామిలీతో ముఖ్యమంత్రి విజయ్‌ కలిసిన నటి ఖుష్బూ.. ఎందుకో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha