Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి: మండల ప్రత్యేక అధికారి జగదీష్

బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి: మండల ప్రత్యేక అధికారి జగదీష్

వార్త 1 month ago

Medak ( పెద్ద శంకరంపేట ): బాలల రక్షణకు సంబంధించి పనిచేస్తున్న బాలల పరిరక్షణ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మండల ప్రత్యేక అధికారి జగదీష్ పేర్కొన్నారు.

గురువారం నాడు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఈ కమిటీల పాత్ర కీలకమన్నారు. గ్రామాల్లో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

Read Also: TG Police Promotions: తెలంగాణ పోలీస్ శాఖలో ప్రమోషన్ల జాతర.. ఆ జిల్లాల వారికే ప్రాధాన్యం!

 Medak: Child Protection Committees should be strengthened: Mandal Special Officer Jagadish

ప్రతి గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీలు చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సమన్వయం చేసుకుని పిల్లల సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. బాల్య వివాహాల నివారణ, చైల్డ్ లేబర్ నిర్మూలన, డ్రాప్ అవుట్ పిల్లలను బడిలో చేర్పించడం, 1098 పై అవగాహన కల్పించడంపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్, ఎంపీడీవో క్రాంతికుమార్, ఎస్సై ప్రవీణ్ రెడ్డి, ఎంఈఓ శేఖర్, ఎంపీ ఓ జాకీర్ హుస్సేన్ ఐసిడిఎస్ సూపర్వైజర్లు పుష్పలత, శ్రీశైల, ఆర్ఐ రమేష్, పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

లిక్కర్ కంపెనీ సూపర్ వైజర్ ఆగడాలు.. లైంగిక వేధింపులపై మహిళా కార్మికుల ధర్నా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha