Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్య మెగా ప్రాజెక్ట్! బసవతారకం ఆస్పత్రి పనులు ప్రారంభం

బాలయ్య మెగా ప్రాజెక్ట్! బసవతారకం ఆస్పత్రి పనులు ప్రారంభం

వార్త 1 month ago

Basavatarakam Cancer Hospital: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ అడుగుపెట్టింది. తుళ్లూరు సమీపంలో రూ.750 కోట్లతో నిర్మించనున్న 'బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి' పనులను ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ ఘనంగా ప్రారంభించారు.

పేదలకు అత్యున్నత వైద్యం అందించడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు.

Read Also:Gangavathi Court: బీజేపీ నేత వెంకటేశ్ కురుబర హత్య కేసు: ఆరుగురికి మరణశిక్ష

Basavatarakam Cancer Hospital: ఆస్పత్రి విశేషాలు

ఆస్పత్రి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 500 పడకల సామర్థ్యంతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రూపుదిద్దుకోనుంది. 2028 నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, రోగులకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాజధానిపై బాలయ్య కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిలో కూడా అటువంటి సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత ప్రజలు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, వారి కల త్వరలోనే సాకారం కాబోతోందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆర్టీసీ బస్సులో సీటు గొడవ.. 14 ఏళ్ల బాలిక పరిస్థితి విషమం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha