NBK 111 Movie Update: నటసింహం నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'NBK111' దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజాగా ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలోకి వచ్చిన క్షణం నుంచే నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
NBK 111 Movie Update: బాలయ్య సరికొత్త లుక్.. 'న్యూ ఏజ్' మాస్ విధ్వంసం!
తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఒక ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను హైలైట్ చేశారు. అదే.. "No More Vintage.. Only New Age" . దీన్ని బట్టి దర్శకుడు గోపీచంద్ మలినేని.. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త, స్టైలిష్ మాస్ అవతారంలో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. వింటేజ్ లుక్స్‌కు భిన్నంగా ఈ సరికొత్త ట్రెండీ లుక్ బాక్సాఫీస్ వద్ద పరుగుల విధ్వంసం సృష్టించనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు.
Read Also : Hema: ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి హేమ
జూన్ 10న రాబోతున్న ఆ ‘బిగ్ సర్ప్రైజ్’ ఏంటి?
ఈ సరికొత్త పోస్టర్‌లో అన్నింటికంటే ముఖ్యంగా జూన్ 10 అనే తేదీని చాలా ప్రత్యేకంగా, పెద్ద అక్షరాలతో హైలైట్ చేశారు. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానుల కోసం ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ ప్రకటన. బాలయ్య పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్. థియేటర్లను షేక్ చేసే రేంజ్‌లో ఒక క్రేజీ గ్లింప్స్ (Teaser Glimpse) విడుదల చేయనున్నారని సమాచారం.
ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి హై-వోల్టేజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలను అందిస్తున్నారు. బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కేవలం టాలీవుడ్‌కే పరిమితం చేయకుండా, భారీ ఎత్తున పాన్-ఇండియా రేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. చిత్ర యూనిట్ అనుసరిస్తున్న ఈ ప్రొమోషన్ల స్ట్రాటజీ చూస్తుంటే… బాక్సాఫీస్ వద్ద ఈసారి బాలయ్య సరికొత్త రికార్డులను సృష్టించడం, రికార్డుల దుమ్ము దులపడం ఖాయంగా కనిపిస్తోంది.
Powerful stylish poster released from NBK 111
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

