Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్య సినిమాలో తమిళ నటుడు ఆర్య?

బాలయ్య సినిమాలో తమిళ నటుడు ఆర్య?

వార్త 3 weeks ago

NBK 112 : నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'NBK 112'. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సమాచారం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో తీవ్రంగా చక్కర్లు కొడుతోంది.

ఈ భారీ యాక్షన్ డ్రామాలో తమిళ ప్రముఖ నటుడు ఆర్య ఒక కీలకమైన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే సామాజిక అంశాలతో పాటు, బాలయ్య మార్క్ ఊరమాస్ యాక్షన్ మరియు బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని కొరటాల శివ డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 NBK 112 Official Announcement

భారీ అంచనాలు.. ఆర్య ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్

సమాజంలో జరిగే కీలక పరిణామాలను తెరపైకి తీసుకురావడంలో కొరటాల శివ స్టైలే వేరు. ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ పాత్రను మునుపెన్నడూ చూడని రీతిలో మాస్ అండ్ ఎమోషనల్ లుక్‌లో చూపించబోతున్నారు. దానికి తోడు తమిళ నటుడు ఆర్య ఎంట్రీ వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. బాలయ్య – ఆర్యల మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నటీనటుల అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

'ఇరుముడి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha