NBK Lifetime Achievement Award: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) కీర్తికిరీటంలో మరో అరుదైన గౌరవం వచ్చి చేరింది. దిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ఆయనకు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డు లభించడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.దిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026' వేడుకలు సినీ దిగ్గజాల కలయికతో మెరిసిపోయాయి.
Read Also:Legendary Telugu Actresses: టాలీవుడ్‌ను కన్నీరు పెట్టించిన నటీమణుల మరణాలు
Nandamuri Balakrishna Lifetime Achievement Award IFFD 2026
NBK Lifetime Achievement Award: ఇతర గ్రహీతలు
దేశ రాజధాని దిల్లీలో బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026’లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందజేశారు.సినీ రంగంలో దశాబ్దాలుగా ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ నిర్వాహకులు ఈ సత్కారం చేశారు.ఈ భారీ కార్యక్రమానికి దిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా నిలిచింది.ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, ప్రముఖ నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
'రాకాస' ట్రైలర్ అదిరింది: హారర్ అండ్ కామెడీతో సంగీత్ శోభన్ సందడి

