Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోదారి గట్టుపైన మూవీ రివ్యూ

గోదారి గట్టుపైన మూవీ రివ్యూ

వార్త 3 months ago

Godari Gattupaina Review: 'మేం ఫేమస్' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కుర్రాడు సుమంత్ ప్రభాస్. తనదైన మార్క్ ప్రమోషన్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే సుమంత్, ఈసారి 'గోదారి గట్టుపైన' అంటూ పల్లెటూరి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ రోజే (మే 8న) విడుదలైన ఈ సినిమా కథ ఏంటో చూద్దాం.

Read Also:Dhurandhar 2 OTT Release Date: త్వరలో ఓటీటీలోకి 'ధురంధర్ 2'?

కథ విషయానికొస్తే..

రాజు(సుమంత్ ప్రభాస్) మంచి ఆటోడ్రైవర్. భీమవరం దగ్గర్లో ఓ పల్లెటూరు. రోజు వాళ్ళ ఊరి నుంచి భీమవరంకు ఆటో నడుపుకుంటాడు. తన చెల్లితో పాటు చదువుకునే మాయ(నిధి ప్రదీప్)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓ గొడవలో మాయని చెంపదెబ్బ కొడతాడు రాజు. అప్పట్నుంచి మాయ కూడా రాజుని ఇష్టపడుతుంది. ఇద్దరూ దగ్గరయి ప్రేమించుకుంటూ తిరుగుతూ ఉంటారు.

మాయ తండ్రి శ్యామ్ బాబు(జగపతి బాబు)ఓ సెక్యూరిటీ గార్డ్. కూతురంటే ప్రాణం. కుతూర్లో మార్పు గమనించి కంగారు పడతాడు. రాజు పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి ఇకపై తనను కలవొద్దు అని కొట్టి మరీ చెప్పి దూరమవుతుంది మాయ. అసలు మాయ ఎందుకు దూరమయింది? రాజు - మాయ మళ్ళీ కలుస్తారా? శ్యామ్ బాబుకి కూతురు ప్రేమ విషయం తెలిసి ఏం చేస్తాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Godari Gattupaina Movie Review

Godari Gattupaina Review: కథనం

సుభాష్ చంద్ర తీసుకున్న పాయింట్, కథ, కథనం, మేకింగ్, టేకింగ్ ఇవన్నీ కూడా అవుట్ డేటెడ్‌గానే కనిపిస్తాయి. ఏ ఒక్క చోట కూడా అరెరే ఇదేదో కొత్త సీన్‌లా ఉందే, సినిమా కొత్తగా ఉందే అని అనిపించదు. మరీ ముఖ్యంగా ఎక్కడా కూడా ఎమోషనల్ కనెక్టివిటీ కనిపించదు. డైరెక్టర్ కొన్నింటిని ట్విస్టులు అని చివర్లో రివీల్ చేస్తాడు. కానీ అవి ట్విస్టులు అని ఆడియెన్స్ అనుకోరు. అలాంటి సీన్ ఒకటి అక్కడ పడుతుందని ఆడియెన్స్ ఎప్పుడో ఊహించేస్తారు. అలా ఊహకందేలా సాగే కథనం కూడా చూసే ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా ఉంటుంది.

ఇక పూర్తిగా ఫన్, లవ్, ఎమోషనల్ అంశాలతో సాగే ఈ సినిమాకు పెద్దగా అభ్యంతరాలు వెల్లడించకుండానే సినిమా రిలీజ్‌కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల అనుమతితో చూడాల్సి ఉంటుందని సెన్సార్ తమ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.గోదారి గట్టుపైన సినిమా హానెస్ట్ అండ్ జెన్యూన్ లవ్ స్టోరీగా రూపొందిందన టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో ఊహకు అందని ట్విస్టులు, టర్న్ లేకుండా ఫీల్ గుడ్ అంశాలతో సాగే కథ కావడంతో నిడివి కూడా బ్యాలెన్స్‌గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు. అంటే 148 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమాను ముగించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

డీఎంకే-అన్నాడీఎంకే కలిస్తే రాష్ట్రానికి ముప్పే: నటుడు విశాల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha