Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలుడిని చంపి, సగం తిన్న మొసలి ..వీడియో వైరల్

బాలుడిని చంపి, సగం తిన్న మొసలి ..వీడియో వైరల్

వార్త 3 weeks ago

Crocodile attack : ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఘాఘరా నది తీరంలో ఒక అత్యంత విషాదకరమైన ఘటన వెలుగుచూసింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ, నది ఒడ్డున చేతులు కడుక్కుంటున్న 12 ఏళ్ల సునీల్ అనే అనాథ బాలుడిపై ఒక భారీ మొసలి ఒక్కసారిగా దాడి చేసింది.

బాలుడిని పదే పదే నీటిలో అటుఇటు విసిరికొడుతూ నది లోపలికి లాక్కెళ్లిపోయింది. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Read Also: Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు DMK మద్దతిస్తుందా?

 Crocodile attack

Crocodile attack : గ్రామంలో తీవ్ర విషాదం

దాదాపు ఐదు గంటల పాటు గాలించిన తర్వాత నదిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అప్పటికే ఆ నరమాంస భక్షక మొసలి బాలుడి నడుము కింది భాగాన్ని పూర్తిగా తినేసింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి మామయ్య వద్ద పెరుగుతున్న సునీల్ ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటవీశాఖ అధికారులు నది పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, ఆ మొసలిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha