Bandla Ganesh: హన్మకొండ జిల్లాలోని హనుమాన్ నగర్‌లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ కుటుంబానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు.
ఇటీవల ఈ బాలుడి కోరిక మేరకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిర్మాత బండ్ల గణేష్ సైతం స్పందించి, హన్మకొండలోని బాలుడి నివాసానికి చేరుకుని నిరంజన్‌ను పరామర్శించారు.
Read Also : Janasena : పవన్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా మాకు ఏంకాదు - మహేష్ కుమార్
Bandla Ganesh provides financial aid of Rs. 5 lakhs to the boy, Niranjan!
Bandla Ganesh: రూ. 5 లక్షల చెక్కు అందజేత
బాలుడి నివాసానికి వెళ్లిన బండ్ల గణేష్, నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించిన ఆయన, బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయంగా రూ. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును బాలుడి తల్లిదండ్రులకు స్వయంగా అందజేశారు.
పవన్ కళ్యాణ్ పరామర్శతో వెలుగులోకి..
అరుదైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఉందనే విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. చిన్నారి కోరికను తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఇటీవల హన్మకొండకు వచ్చి ఆ బాలుడిని ప్రత్యేకంగా పరామర్శించి, ధైర్యం చెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తూ, ఆయన భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ కూడా ఆ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించడం పట్ల స్థానికులు, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

