Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 8 మంది మృతి!

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 8 మంది మృతి!

వార్త 12 hrs ago

Bihar Fire Accident: బిహార్‌లోని సివాన్ జిల్లా బర్హరియా బ్లాక్ పరిధిలోని అలంపుర్ గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో అనుకోకుండా సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.

ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది.

సహాయక చర్యలు ముమ్మరం.. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు

ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Bihar Fire Accident: మహమ్మద్ ఆలంఘీర్ మియాన్ నివాసంలోనే పేలుడు

ప్రాథమిక సమాచారం ప్రకారం.. మహమ్మద్ ఆలంఘీర్ మియాన్ అనే వ్యక్తి తన ఇంట్లోనే అనధికారికంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆయన నివాసంలో అనుకోని రీతిలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు అక్కడే నిల్వ ఉంచిన టపాసుల సామగ్రికి అంటుకోవడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ తీవ్రమైన పేలుళ్ల ధాటికి ఇల్లు తీవ్రంగా ధ్వంసమవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది.

నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha