Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విచారణ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
రూ. 10,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఒక షూరిటీని సమర్పించాలంటూ పోలీసులు ఈ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
PM Modi: డిసెంబర్‌లో తెలంగాణకు ప్రధాని మోదీ.. ఏయే ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయంటే?
అన్ని ఆధారాలు అందజేయాలని హైకోర్టు ఆదేశం
పిటిషన్‌ను కొట్టివేసినప్పటికీ, విచారణలో పరిగణనలోకి తీసుకున్న ఆధారాలు, సమాచారాన్ని నేహా బోరాకు అందించాలని ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే, బీఎన్‌ఎస్ సెక్షన్ 135 ప్రకారం.. విచారణ ప్రారంభంలోనే బాండ్ తీసుకోవాలా లేదా విచారణ పురోగతిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలను బట్టి నిర్ణయించాలా అనే విషయాన్ని మేజిస్ట్రేట్ పరిశీలించాలని కోర్టు పేర్కొంది.

అసలేం జరిగింది?
ఎలక్టోరల్ రోల్స్ ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయంటూ, విచారణాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ అక్టోబర్ 16న ఢిల్లీలో 'లేహ్రా దొ తిరంగా' మార్చ్ నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న నేహా బోరాను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత అక్టోబర్ 17న BNSS సెక్షన్ 126 కింద ఆమెకు నోటీసులు జారీ అయ్యాయి. అక్టోబర్ 19న మేజిస్ట్రేట్ ముందు హాజరై, శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాండ్ ఎందుకు సమర్పించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు ఇవే
పోలీసుల నోటీసుల్లో సరైన ఆధారాలు లేవని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాననడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు పౌరులకు ఎవరి అనుమతి అవసరం లేదని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం లేదా వ్యవస్థల్లో మార్పును కోరడం తప్పు కాదని సీనియర్ కౌన్సిల్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను లేదా వ్యవస్థలను కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే మార్చగలరని, ప్రశాంతమైన న్యూఢిల్లీలో చట్టాన్ని ఉల్లంఘించి గుమిగూడే గుంపుల ద్వారా కాదని పోలీసులు గట్టిగా వాదించారు. సెక్షన్ 163 ఉల్లంఘించి మండి హౌస్, జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతూ ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు.
Epaper: epaper.vaartha.com

