Sricity Factory Accident: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో శనివారం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఉన్న వాటర్ బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Also : AP government: బీసీ రిజర్వేషన్ల కేసులో సంచలనం
Four workers killed in boiler explosion; CM Chandrababu shocked.
Sricity Factory Accident: అక్కడికక్కడే ఇద్దరు మృతి.. ఆస్పత్రిలో మరో ఇద్దరు కన్నుమూత
శ్రీసిటీలోని ప్రైవేటు ఫ్యాక్టరీలో శనివారం పనులు జరుగుతుండగా వాటర్ బాయిలర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ తీవ్ర పేలుడు ధాటికి ఇద్దరు కార్మికులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ ఇద్దరు కూడా కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మరో కార్మికుడికి ప్రస్తుతం అత్యవసర వైద్య చికిత్స కొనసాగుతోంది.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న వెంటనే సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. “ఇది చాలా విషాదకరమైన సంఘటన. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాను” అని వెల్లడించారు. అలాగే హోంమంత్రి అనిత తిరుపతి జిల్లా యంత్రాంగంతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అధికారులు విచారణ వేగవంతం చేశారు.

