Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమ వ్యవహారంలో విషాదం.. యువతిపై దాడి, యువకుడి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారంలో విషాదం.. యువతిపై దాడి, యువకుడి ఆత్మహత్య

వార్త 3 weeks ago

Vijayawada Crime : విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఆరు నెలలుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో యువకుడు చిన్నా 19 ఏళ్ల యువతిపై దాడి చేసినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. అనంతరం పక్కనే ఉన్న భవనం నుంచి దూకి అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

narco kingpin Navpreet Singh from Turkey : నవప్రీత్ సింగ్‌ను రప్పించడంలో భారత్ విజయం : అమిత్ షా

 Vijayawada Crime

Vijayawada Crime : తీవ్రంగా గాయపడిన యువతికి ఆస్పత్రిలో చికిత్స

దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు గురయ్యారు. మరోవైపు చిన్నా మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇటీవల కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని, యువతి అరుపులు విని వచ్చేసరికి ఆమె తీవ్ర గాయాలతో కనిపించిందని వారు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి దారితీసిన కారణాలు, ఘటనకు ముందు జరిగిన పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha