పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ (Badminton International) టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన స్టార్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ తులసిమతి అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొన్న తులసి, ఏకంగా మూడు బంగారు పతకాలు సాధించి భారత క్రీడా చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించారు. తమిళనాడుకు చెందిన తులసి ఏప్రిల్ 11, 2002లో జన్మించారు. తులసి ఎడమచేతికి పూర్తి వైకల్యం ఉన్నా దాన్ని అధిగమించి ఏడేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక పతకాలు గెలుచుకున్న ఆమె ఖాతాలో పారిస్ పారాలింపిక్స్ రజత పతకం కూడా ఉంది.


