Karnataka Crime: సభ్య సమాజం తలదించుకునేలా కర్ణాటకలో ఒక భయంకరమైన హత్యోదంతం వెలుగుచూసింది. కళ్లముందే భార్య వేడుకుంటున్నా కనికరం లేకుండా గొంతు కోసి, ఆపై కారుతో తొక్కిచ్చి చంపిన ఘటన గంగాపుర ప్రాంతంలో కలకలం రేపింది.
కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Read Also: మార్కాపురం బస్సు ప్రమాదంలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య
ఘటన వివరాలు
పోలీసుల కథనం ప్రకారం.. అక్షయ్, శైలజ అనే దంపతులు గురువారం ఉదయం తమ మారుతి సుజుకి ఎర్టిగా కారులో గంగాపుర పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. ఉదయం 11 గంటల సమయంలో బల్లూర్గ గ్రామం సమీపానికి చేరుకోగానే, కారులోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Karnataka Crime: Husband kills wife by slitting her throat in public
Karnataka Crime: నడిరోడ్డుపై నరరూప రాక్షసుడిలా..
కోపంతో ఊగిపోయిన అక్షయ్, కారు ఆపి భార్య శైలజను బయటకు తోసేశాడు. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ప్రాధేయపడినా వదలకుండా గొంతు కోశాడు. చివరగా అత్యంత పాశవికంగా ఆమె శరీరంపై నుంచి కారును వేగంగా పోనిచ్చాడు. కారు చక్రాల కింద నలిగిపోయిన శైలజ రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
పరారీలో నిందితుడు
ఈ దారుణాన్ని చూసిన వాహనదారులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన తర్వాత అక్షయ్ కారుతో సహా పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గాలిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

