Yadiki Boy Murder Case Updates: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఉప్పలపాడులో గురువారం జరిగిన ఘోర బాలుడి హత్య కేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. బాలుడిని హత్య చేసిన నిందితుడు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా పోలీసులపై తిరగబడ్డాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడి మోకాళ్లపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
Read Also: మార్కాపురం బస్సు ప్రమాదంలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య
Yadiki Boy Murder Case Updates: Twist in Yadiki murder case.. Police firing on the accused!
Yadiki Boy Murder Case Updates: ఘటన వివరాలు
కోనఉప్పలపాడులో ఐదేళ్ల బావమరిది వేంచంద్రను అతని బావ సర్వేష్‌కుమార్ (23) గురువారం అతి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సర్వేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితుడిని కొండల ప్రాంతంలో ఉన్న ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా పోలీసులపై తిరగబడ్డాడు.
పోలీసులపై దాడి మరియు కాల్పులు
నిందితుడు సర్వేష్ కొండల్లో పడి ఉన్న ఖాళీ బీరు బాటిల్‌తో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు హెచ్చరించినా లెక్కచేయకుండా బీరు బాటిల్ పగలగొట్టి దాడికి దిగాడు. దీంతో పోలీసులు గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినా వెనక్కి తగ్గలేదు. ఆత్మరక్షణ కోసం సీఐ రామసుబ్బయ్య నిందితుడి మోకాళ్లపై కాల్పులు జరిపారు.
గాయపడిన పోలీసులు మరియు నిందితుడు
ఈ ఘటనలో నిందితుడు సర్వేష్‌కుమార్‌తో పాటు సీఐ రామసుబ్బయ్య మరియు మరో కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. గాయపడిన నిందితుడు, సీఐ, కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

