Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బక్రీద్‌కు తెలంగాణ పోలీసుల భారీ భద్రతా చర్యలు

బక్రీద్‌కు తెలంగాణ పోలీసుల భారీ భద్రతా చర్యలు

వార్త 1 week ago

Telangana Police : రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలు, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

బుధవారం అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

అక్రమ పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా

బక్రీద్ సందర్భంగా అక్రమంగా పశువుల రవాణా, స్మగ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులుఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయని తెలిపారు.

చట్టాలను కఠినంగా అమలు చేయాలి

కౌ స్లాటర్ యాక్ట్ 1977, ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ అనిమల్స్ రూల్స్ 1978, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు అనిమల్స్ యాక్ట్ 1960 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. పశువుల రవాణాకు సంబంధించిన ఫిట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్, ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికెట్లను ప్రతి చెక్‌పోస్ట్ వద్ద పూర్తిగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

సోషల్ మీడియాలోనూ ప్రత్యేక నిఘా

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. అలాంటి పోస్టులు పెట్టిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు పిలిపించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read Also:Sanatana Dharma: సనాతన ధర్మంపై తగ్గేదే లేదన్న ఉదయనిధి

 Telangana Police

ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

ఖురేషీ సంఘాలు, గోరక్షణ గ్రూపులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ సూచించారు. కేవలం అనుమానం ఆధారంగా రోడ్లపై ఆందోళనలు చేయడం, వాహనాలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

శాఖల మధ్య సమన్వయం కీలకం

పోలీసులు, మున్సిపల్ శాఖ, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ తెలిపారు. జిల్లా, ఫీల్డ్ స్థాయిలో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం పంచుకోవాలని సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తమిళనాడులో 'విజయ్' కేక: షణ్ముగంతో కీలక భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha