Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్ కేసు ఎఫెక్ట్.. సిరిసిల్లలో చెలరేగిన రాజకీయ మంటలు

బండి భగీరథ్ కేసు ఎఫెక్ట్.. సిరిసిల్లలో చెలరేగిన రాజకీయ మంటలు

వార్త 3 months ago

Bandi Bhagirath Case: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని రద్దీ ప్రాంతమైన అంబేద్కర్ చౌరస్తాలో అధికార భారత్ రాష్ట్ర సమితి (BRS), భారతీయ జనతా పార్టీ (BJP) శ్రేణులు పరస్పరం దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఉన్న పోక్సో కేసు వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ నాయకులు చౌరస్తాలో ఆందోళనకు దిగారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటే బాధితురాలికి న్యాయం జరగదని, పోలీసులపై ఒత్తిడి ఉంటుందని ఆరోపిస్తూ ఆయనను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

Read Also :Bandi Bhageerath Arrest : భగీరథ్ అరెస్ట్ పై కిషన్ రెడ్డి రియాక్షన్

Bandi Bhagirath Case: అయితే, బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు, స్థానిక బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శాంతియుతంగా తాము చేస్తున్న ఆందోళనపై బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దూసుకొచ్చి దాడికి పాల్పడ్డాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరుపక్షాలు ఒకరినొకరు నెట్టుకుంటూ ఘర్షణకు దిగడంతో అంబేద్కర్ చౌరస్తా రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం..కోమటిరెడ్డి సంతాపం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha