Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్ కేసు.. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? : ప్రకాశ్ రాజ్

బండి భగీరథ్ కేసు.. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? : ప్రకాశ్ రాజ్

వార్త 1 week ago

Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో తాజాగా తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, పోలీసులు సెక్షన్లను సవరించి “తీవ్రమైన లైంగిక దాడి” కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Dileep Raj Passes Away: గుండెపోటుతో కన్నడ నటుడు దిలీప్ రాజ్ మృతి

 “Revanth Reddy garu.. why aren’t you arresting the accused?” – Prakash Raj.

Bandi Bhagirath: “బేటా బచావో” అంటూ ప్రకాశ్ రాజ్ సెటైర్లు

ఈ వ్యవహారంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నేరుగా ప్రశ్నలు సంధించిన ఆయన, నిందితుడి అరెస్ట్ విషయంలో జాప్యాన్ని తప్పుబట్టారు. “బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు?” అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో’ అని నినదిస్తుంటే, ఇక్కడ మాత్రం ‘బేటా బచావో’ (కొడుకును కాపాడండి) అన్నట్లుగా వ్యవహారం సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

హైకోర్టులో బెయిల్ పిటిషన్

మరోవైపు, ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం తన పనిని వేగవంతం చేసింది. సాయి భగీరథ్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మరియు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మే 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్‌ దేశం దాటకూడదు: పోలీసులకు కవిత విజ్ఞప్తి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha