Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుండెపోటుతో కన్నడ నటుడు దిలీప్ రాజ్ మృతి

గుండెపోటుతో కన్నడ నటుడు దిలీప్ రాజ్ మృతి

వార్త 1 week ago

Dileep Raj Passes Away: కన్నడ సినీ ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తన ఇంట్లో ఉన్న సమయంలో దిలీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తక్షణమే ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. కేవలం 47 ఏళ్ల వయసులోనే దిలీప్ రాజ్ మృతి చెందడం అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

దిలీప్ రాజ్ కన్నడలో పలు సినిమాల్లో నటించినప్పటికీ 2007లో పునీత్ రాజ్‌కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'మిలానా' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత యూ టర్న్ చిత్రంలోనూ కీలక పాత్రపోషించారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.

Read Also: Karuppu Movie: 'కరుప్పు' చిత్రం స్పెషల్ షోలకు తమిళనాడు గ్రీన్ సిగ్నల్!

 Kannada actor Dileep Raj passes away due to heart attack

Dileep Raj Passes Away: బుల్లితెరపైనా మెప్పించిన దిలీప్ రాజ్

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా దిలీప్ రాజ్ తిరుగులేని ముద్ర వేశారు. ‘డీఆర్ క్రియేషన్స్’ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారిన ఆయన, పలు విజయవంతమైన టీవీ సీరియళ్లను నిర్మించారు. కొన్ని సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించి ఇంటింటికీ చేరువయ్యారు. నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ కళాకారుడిగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎనలేనివి. దిలీప్ రాజ్ మరణవార్త తెలియగానే పలువురు కన్నడ నటీనటులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha