Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్ పోక్సో కేసుపై స్పందించిన మంచు మనోజ్

బండి భగీరథ్ పోక్సో కేసుపై స్పందించిన మంచు మనోజ్

వార్త 3 months ago

Bandi Bhagirath case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

ఈ వివాదంపై టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మనోజ్ స్పందించారు. మైనర్ బాలికల భద్రత, చట్టం అమలు విషయంలో తన గళాన్ని వినిపించారు.

Read Also: Ponnam Prabhakar: బండి సంజయ్ విచారణపై పొన్నం క్లారిటీ

 Tollywood Actor’s Reaction to the Hearing of the Bhagirath Case

Bandi Bhagirath case: బాధితురాలికి న్యాయం జరగాలి

మైనర్ బాలికల సంరక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం లేదా ఆలస్యం చేయకూడదని మనోజ్ అభిప్రాయపడ్డారు. బాధితురాలికి సకాలంలో న్యాయం చేయడమే ప్రాథమిక లక్ష్యం కావాలని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ శక్తులు, అధికారం, సామాజిక హోదా లేదా ప్రభావం వల్ల విచారణ ప్రక్రియ ఏమాత్రం ప్రభావితం కాకూడదని మంచు మనోజ్ స్పష్టం చేశారు. “రాజకీయ ప్రభావం వల్ల విచారణ పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మైనర్లకు సంబంధించిన కేసులను యుద్ధ ప్రాతిపదికన, అత్యంత పారదర్శకంగా విచారించాల్సిన అవసరం ఉంది” అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భగీరథ్ పోక్సో కేసు నమోదుపై స్పందించిన బాలల హక్కుల కమిషన్, రామచంద్ర రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha