Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్ పోక్సో కేసు నమోదుపై స్పందించిన బాలల హక్కుల కమిషన్, రామచంద్ర రావు

భగీరథ్ పోక్సో కేసు నమోదుపై స్పందించిన బాలల హక్కుల కమిషన్, రామచంద్ర రావు

వార్త 2 weeks ago

Bandi Bhagirath: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, భగీరథ్ పై పోక్సో కేసు నమోదు అయి ఇప్పటికే మూడురోజులు అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ కుమద్దతు ఉందని, అందుకే పోలీసులు వెనుకంజ వేస్తున్నారని ఇప్పటికే బీఆర్ ఎస్, ఇతర ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

Read Also: Sangareddy: నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. సుభాష్ రెడ్డి

 The Child Rights Commission has responded to the Bhagirath case

Bandi Bhagirath: ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

బండి భగీరథ్ పై నమోదైన కేసులో వెంటనే విచారణ మొదలుపెట్టలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాక కేసు విచారణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించిన రేవంత్ రెడ్డి, సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదని రేవంత్ రెడ్డి డీజీపీని అడిగారు. శనివారం హైదరాబాద్ లో మోదీ భారీ బహిరంగ సభ, ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని సిఎంకు డీజీపి వివరించినట్లు తెలుస్తున్నది.

స్పందించిన బాలల హక్కుల కమిషన్

కాగా బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. కమిషన్ ఛైర్ పర్సన్ కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి సీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోక్సో కేసు విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధం లేదు రామచందర్ రావు కాగా బండి భగీరథ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బండి భగీరథ్ కేసుతో బీజేపీకి సంబంధం లేదన్నారు. బండి సంజయ్ కుటుంబీకుల జోక్యం ఉంటే విచారణ చేయించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ లో ఆదివారం ప్రధాని మోదీ పర్యటన, బహిరంగ సభ విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha