Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bandi Sanjay : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

వార్త 3 months ago

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర మంత్రుల అవినీతిపై తాము ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే వారి 'అవినీతి చిట్టాను' బహిర్గతం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా కొంతమంది ఐఏఎస్ అధికారులు మంత్రుల అవినీతి దందాలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, అటువంటి అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 'టీపీసీసీ' అంటే తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్ కాంగ్రెస్ (T4C) అని అభివర్ణిస్తూ, 2029 నాటికి దేశంలో కాంగ్రెస్ పాలన కనుమరుగవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

IFR Milan 2026 : విశాఖలో అంతర్జాతీయ పరేడ్ వైభవం, ప్రపంచం చూపు ఇక్కడే!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు పాలనపై సంజయ్ సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. 'తెలంగాణ రైజింగ్' మరియు 'దావోస్' పర్యటనల ద్వారా రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఆయన విమర్శించారు. ఆ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బ్లాంక్ చెక్కులు, కార్లు ఆఫర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు కుమ్మక్కై బీజేపీని అడ్డుకోవాలని చూసినా ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర పాలన మరియు జీహెచ్ఎంసీ (GHMC) విభజన అంశంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, కేవలం మజ్లిస్ పార్టీ (MIM) మెప్పు కోసమే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారని ఆరోపించారు. ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో లేని విభజన ఇక్కడెందుకని ప్రశ్నిస్తూ, హిందూ ఓట్లను చీల్చేందుకే ఈ కుట్ర పన్నారని మండిపడ్డారు. గత రెండేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క తట్ట మొరం కూడా పోయలేదని, వచ్చే ఎన్నికల్లో నగర ప్రజలు కాంగ్రెస్‌ను మూసీ నదిలో పడేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha