Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాల్‌ రాజకీయాల్లో నూతన శకం: బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారి

బంగాల్‌ రాజకీయాల్లో నూతన శకం: బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారి

వార్త 2 weeks ago

శ్చిమ బెంగాల్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ అట్టహాసమైన కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.

రవి ఆయన చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దీనితో బెంగాల్‌ గడ్డపై తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరినట్లయింది. 1971తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు.

Read Also: West Bengal: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

 W.Bengal CM

W.Bengal CM: కలకత్తాయేతర జిల్లా నుంచి అరుదైన గుర్తింపు

ఈ ప్రమాణ స్వీకారంతో సువేందు అధికారి ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1971 తర్వాత కలకత్తా (కోల్‌కతా) నగరం వెలుపల ఉన్న జిల్లా నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నాయకుడిగా ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టు ఈ విజయంతో మరోసారి నిరూపితమైంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి దేశంలోని అగ్రనేతలు తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, రామ్మోహన్‌ నాయుడు.
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలు ఎన్​డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ తదితరులు.

'సోనార్‌ బంగ్లా' లక్ష్యంగా సువేందు పోస్ట్

ప్రమాణ స్వీకారానికి ముందు సువేందు అధికారి ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్‌ చేశారు. "బంగాల్‌ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఉదయం. దశాబ్దాలుగా కొనసాగుతున్న దుర్వినియోగ పాలనకు నేటితో స్వస్తి పలికామని, ఇకపై రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా శాంతి, అభివృద్ధి వెల్లివిరుస్తాయని" ఆయన పేర్కొన్నారు. 'సోనార్‌ బంగ్లా' (బంగారు బెంగాల్) కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన దుర్వినియోగ పాలనకు నేటితో ముగింపు పలుకుతున్నాం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

రూ.300 కోట్లు ఇస్తేనే కాంగ్రెస్‌లో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha