Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్!

వార్త 2 weeks ago

AP Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన మరో కొత్త అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపు జల్లులు పడే ఛాన్స్ ఉందన్నారు.

Read Also :Delhi Heavy Rains: ఢిల్లీలో కుండపోత వర్షాలు.. స్తంభించిన జనజీవనం

AP Telangana Rains:వచ్చే వారానికి వాతావరణ శాఖ బులిటెన్.. రైతులకు ఊరట!

  • సముద్రంలో అలజడి: అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు వహించాలని కోరారు.
  • ప్రత్యేక హెచ్చరికలు లేవు: రానున్న కొద్ది గంటల వర్షాల ముప్పు మినహా, సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక తీవ్ర/భారీ వాతావరణ హెచ్చరికలు (Heavy Weather Alerts) లేవని వాతావరణ విభాగం తమ వారాంతపు బులిటెన్‌లో స్పష్టం చేసింది.
  • రైతన్నలకు ఊరట: సెప్టెంబర్ రెండో వారంలో భారీ వర్షాల హెచ్చరికలు లేకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు, కోత దశలో ఉన్న పంటలకు పెద్దగా నష్టం ఉండదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha