Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో కుండపోత వర్షాలు.. స్తంభించిన జనజీవనం

ఢిల్లీలో కుండపోత వర్షాలు.. స్తంభించిన జనజీవనం

వార్త 2 weeks ago

Delhi Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పలు ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Read Also : RBI VRRR Auction: బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్‌బీఐ షాక్.. రూ.7 లక్షల కోట్లు వెనక్కి!

 Delhi brought to a standstill by rains; floodwater enters the airport.

Delhi Heavy Rains: జలమయమైన ప్రధాన రహదారులు, డ్రైనేజీలు

వర్షపు నీటితో కన్నాట్‌ ప్లేస్‌, లజ్‌పత్‌ నగర్‌, అక్బర్‌ రోడ్‌ వంటి నగరంలోని పలు కీలకమైన ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి మురుగు నీరు చేరి స్థానిక ప్రజలు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి కూడా భారీగా వరద నీరు చేరడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలవు విమాన సేవలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలో నెలకొన్న ఈ తీవ్ర ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ, నగర పాలక అధికారులు హెచ్చరించారు.

రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 10న పలు రైళ్లు రద్దు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha