Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

వార్త 3 months ago

AP Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న రోజుల్లో మరింత బలంగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

Read also: Temperature : ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు శుభవార్త

 Heavy Rains in AP

AP Weather: ఎండల తీవ్రత నుంచి స్వల్ప ఉపశమనం

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. శనివారం వడగాడ్పుల ప్రభావం కొంచెం తగ్గినా వేడి మాత్రం అలాగే ఉంది. ఉక్కపోత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్నూలు జిల్లా తోవిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే సాయంత్రం వేళ కొన్ని చోట్ల వీచిన ఈదురుగాలులు భానుడి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగించాయి.

సాయంత్రం వేళల్లో ఈదురు గాలులు

రాబోయే రెండు రోజుల్లో వాతావరణం వేగంగా మారనుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసి వాతావరణాన్ని చల్లబరిచాయి. రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేడి వాతావరణం తగ్గుముఖం పట్టి వర్షాలు మొదలైతే ఉక్కపోత నుంచి పూర్తి ఊరట లభిస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha