Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు

వార్త 3 months ago

Rain Alert: ఎండవేడిమితో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం, ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Read Also : Fishermen : మత్స్యకారులకు CM చంద్రబాబు శుభవార్త

Rain Alert: తెలంగాణలో వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణ మార్పులు ఈ విధంగా ఉండనున్నాయి. శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఏపీ, రాయలసీమలో పరిస్థితి

ఆంధ్రప్రదేశ్, పరిసర ప్రాంతాల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో కూడా శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ప్రజలకు ఉపశమనం

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా, ఈ అకాల వర్షాలు ప్రజలకు ఎండ వేడి నుండి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయని భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

సీఎం సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha