Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులం రేటు షాకింగ్ స్థాయికి

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులం రేటు షాకింగ్ స్థాయికి

వార్త 3 days ago

Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయంగా మాత్రం వరుసగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా రూపాయి మారకం విలువ బలహీనపడటం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగి, దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా ఎగబాకుతున్నాయి.

రూపాయి పతనం ప్రభావం

అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతోంది. దీంతో బంగారం దిగుమతుల ఖర్చు పెరిగి దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దిగుమతి సుంకాల ప్రభావం కూడా దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also ; 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్‌లైన్

 Gold Price Today

హైదరాబాద్‌లో కొత్త బంగారం రేట్లు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.490 పెరిగి రూ.1,59,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ.1,46,600 వద్ద కొనసాగుతోంది. కేవలం మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.3700 పెరగడం గమనార్హం.

వెండి ధరలూ భారీ జంప్

బంగారంతో పాటు వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.5000 పెరిగి రూ.2,90,000కు చేరింది. ఇటీవలే వెండి ధరలు రూ.3 లక్షల మార్క్‌ను కూడా దాటిన విషయం తెలిసిందే. లలితా జువెలరీ వంటి ప్రముఖ సంస్థల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇండియాకు కావాల్సినంత ఆయిల్ ఇస్తాం - మార్కో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha