Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండియాకు కావాల్సినంత ఆయిల్ ఇస్తాం - మార్కో

ఇండియాకు కావాల్సినంత ఆయిల్ ఇస్తాం - మార్కో

వార్త 3 months ago

Crude Oil : భారతదేశానికి అవసరమైన ఇంధన అవసరాలను తీర్చడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. ఈ నెల 23 నుంచి 26 వరకు భారత్‌లో పర్యటించనున్న అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, తన పర్యటనకు ముందు స్వీడన్ వెళ్లే క్రమంలో ఇంధన సరఫరాపై అంతర్జాతీయ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్ ఎంత పరిమాణంలో ముడిచమురు (Crude Oil) లేదా ఇంధనాన్ని కొనాలనుకుంటే, అంత మొత్తంలో సరఫరా చేయడానికి అమెరికాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో చమురు ఉత్పత్తి, ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న మార్పుల నేపథ్యంలో అమెరికా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్స్‌లో భారత్‌ను ఒక అతిపెద్ద భాగస్వామిగా (Major Partner) మార్చడమే ట్రంప్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రూబియో వ్యాఖ్యానించడం గమనార్హం.

Read Also ; 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్‌లైన్

 UAE

వెనిజులా ఆయిల్ ఆప్షన్, ‘క్వాడ్’ భేటీ ప్రాధాన్యత

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత వంటి పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో భారత్‌కు ఇంధన రక్షణ కల్పించేందుకు అమెరికా సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే, అమెరికా పర్యవేక్షణలో ఉన్న వెనిజులా ముడిచమురును కూడా భారత్ కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తామని, అందుకోసం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారని మార్కో రూబియో వెల్లడించారు. తన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కోల్‌కతా, ఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శించనున్న రూబియో.. మే 26న న్యూఢిల్లీలో జరిగే ‘క్వాడ్’ (Quad) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ఈ చమురు వ్యాపార ఒప్పందాలు మరియు ఇంధన భాగస్వామ్యంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ వచ్చే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇటలీలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం: 'FAO అగ్రికోలా మెడల్' ప్రదానం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha