Gold silver Jewellery: బంగారం, వెండి ఆభరణాల ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతిదారులకు తిరిగి చెల్లించే 'డ్యూటీ డ్రాబ్యాక్' (Duty Drawback) మొత్తాన్ని తగ్గిస్తూ నూతన ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా సవరణల ప్రకారం, బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ. 57.88, వెండి ఆభరణాలపై కిలోకు రూ. 2,642.07 మేర రీఫండ్ తగ్గనుంది.
Gold Rate Today: బంగారం కొనేవారికి ఊరట.. తగ్గిన పసిడి ధరలు
Centre’s sensational decision regarding gold and silver jewellery
Gold silver Jewellery: అసలు ‘డ్యూటీ డ్రాబ్యాక్’ అంటే ఏమిటి?
వ్యాపార సంస్థలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆభరణాలను తయారు చేసినప్పుడు, దానికి అవసరమైన ముడి పదార్థాల కొనుగోలుపై వారు చెల్లించే సుంకాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి తిరిగి చెల్లిస్తుంది. ఈ వాపసు మొత్తాన్నే ‘డ్యూటీ డ్రాబ్యాక్’ అంటారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం, పసిడి ఆభరణాలపై లభించే ఈ వాపసు 3.1 శాతం మేర తగ్గగా, వెండి ఆభరణాలపై దాదాపు 9 శాతం మేర తగ్గింది.
ఎంత మేర కోత పడిందంటే?
- బంగారు ఆభరణాలు: టారిఫ్ ఐటమ్ 711301 పరిధిలోకి వచ్చే బంగారు ఆభరణాలపై డ్యూటీ డ్రాబ్యాక్ రేటు గతంలో ఉన్న గ్రాముకు రూ. 1,851.99 నుండి రూ. 1,794.11కి తగ్గింది. దీనివల్ల ప్రతి గ్రాముపై రూ. 57.88 వరకు రీఫండ్ తగ్గనుంది.
- వెండి ఆభరణాలు: వెండి ఆభరణాలు, ఇతర వెండి వస్తువుల (టారిఫ్ ఐటమ్స్ 711302, 711401) విషయంలో ఈ రేటు కిలోగ్రాముకు రూ. 29,501.09 నుండి ఏకంగా రూ. 26,859.02కి పడిపోయింది. అంటే కిలోకు రూ. 2,642.07 మేర వాపసు తగ్గింది.
రేట్లు తగ్గించడానికి కారణం ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు, దిగుమతి వ్యయాల మార్పులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూలైలో ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రేట్లను భారీగా పెంచిన ప్రభుత్వం.. ప్రస్తుతం పసిడి, వెండి ధరలలో చోటుచేసుకున్న మార్పులు, వ్యాపారులు చెల్లిస్తున్న వాస్తవ దిగుమతి సుంకాలను బేరీజు వేసుకుంటూ ఈ రేట్లను పునఃసమీక్షించి తగ్గించినట్లు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) కార్యదర్శి సురేంద్ర మెహతా వివరించారు.
Epaper: epaper.vaartha.com

