Bangladesh : బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ పరిధిలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు.
మృతులను రిటైర్డ్ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (64), ఆయన భార్య ప్రీతిలత (50), వీరి పిల్లలు అగామి (23), ప్రియమ్ (12)గా పోలీసులు గురించారు. బయట నుంచి తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. ఒకే కుటుంబంలోని నలుగురు దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.
గొంతు నులిమి చంపినట్లు అనుమానాలు: దిగ్భ్రాంతిలో స్థానిక సమాజం
మృతదేహాలు పడి ఉన్న తీరు ఘటన తీవ్రతకు, దారుణానికి అద్దం పడుతోంది. ప్లానింగ్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రీతిలత, అగామిల మృతదేహాలు మెట్లపై రక్తం మడుగులో లభించగా, గణపతి చక్రవర్తి శరీరం ఇంటి పైభాగంలో, చిన్న కుమారుడు ప్రియమ్ మృతదేహం మంచం కింద పడి ఉంది. బాధితులందరినీ గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య వెనుక ఉన్న నిజమైన కారణాలు, నేరస్థుల మూలాలను వెలికితీసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు.
తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ సెంటర్.. సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ ఆహ్వానం!

