Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bapatla: మరో మహిళతో భర్త జీవనం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

Bapatla: మరో మహిళతో భర్త జీవనం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

వార్త 4 months ago

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కర్రి ఉమ (36) అనే వివాహిత తన ఇంట్లోనే చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ సమస్యలు ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు సమాచారం. భర్త సాయికుమార్ హైదరాబాద్‌లో మరో మహిళతో నివసిస్తున్నాడనే విషయం ఆమెను మానసికంగా కుంగదీసింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read also: Krishna District: పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

Husband living with another woman.. Wife commits suicide out of resentment

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో మరింత కుంగిన ఉమ

భర్త దూరంగా ఉండటంతో కుటుంబ పోషణ బాధ్యత మొత్తం ఉమపైనే పడింది. ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు గురించి ఆమె ఆందోళన చెందుతూ వచ్చిందని బంధువులు చెబుతున్నారు. అదే సమయంలో అనారోగ్య సమస్యలు కూడా ఆమెను వేధించాయి. మానసిక ఒత్తిడి రోజురోజుకు పెరగడంతో నిర్ణయం తీసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయి అనాథలయ్యారు.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కుటుంబ కలహాలు ఎంతటి దురంతాలకు దారితీస్తాయో ఈ సంఘటన మళ్లీ గుర్తుచేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha