Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్ డ్రైవర్ ఇంట్లో 20 కోట్ల నగదు, 15KGల బంగారం!

బస్ డ్రైవర్ ఇంట్లో 20 కోట్ల నగదు, 15KGల బంగారం!

వార్త 1 week ago

Bus Driver : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇసుక, క్వారీ మాఫియా అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు కళ్లు తిరిగిపోయే షాక్ తగిలింది. బెంగాల్ రవాణా శాఖలో మాజీ బస్ డ్రైవర్‌గా పనిచేసిన మినార్ మండల్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఊహించని రీతిలో నల్లధనం వెలుగుచూసింది.

ఆయన నివాసం నుంచి అధికారులు ఏకంగా ₹20 కోట్ల నగదుతో పాటు 15 కిలోల విదేశీ మార్కింగ్ ఉన్న బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ బస్ డ్రైవర్ నివాసంలో ఇంత భారీ ఎత్తున చట్టవిరుద్ధంగా నిల్వ ఉంచిన సొమ్ము, బంగారాన్ని చూసి దాడుల్లో పాల్గొన్న అధికారులే నోరెళ్లబెట్టారు.

స్థానిక డాన్‌తో బంధుత్వం.. క్వారీ వ్యాపారం పేరిట అక్రమార్జన

ఈ భారీ అక్రమ సంపాదన వెనుక స్థానిక ఇసుక, క్వారీ మాఫియాతో ఉన్న సంబంధాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో తీవ్ర నేర చరిత్ర కలిగిన స్థానిక డాన్ తులు మండల్‌కు ఈ మినార్ మండల్ దగ్గరి బంధువు కావడం గమనార్హం. గతంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పనిచేసిన మినార్, ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన బంధువు అండదండలతో క్వారీ వ్యాపారంలోకి దిగాడు. ఇసుక, మైనింగ్ అక్రమ రవాణా ద్వారానే ఈ స్థాయి ఆస్తులు, నగదును కూడబెట్టినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

శ్రావణ మాసం వేళ నాగర్‌సోల్ ప్రత్యేక రైళ్లు.. రూట్ వివరాలు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha