Tirupati Shirdi Special Trains: తిరుపతి మరియు షిర్డీ (నాగర్‌సోల్) పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. రాబోయే శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీని తట్టుకునేందుకు మరియు రెగ్యులర్ రైళ్లలోని వెయిటింగ్ లిస్ట్ భారాన్ని తగ్గించేందుకు తిరుపతి - నాగర్‌సోల్ (షిర్డీ సమీపం) మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
Read Also :AP MEMU Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో పలు మెమో రైళ్లు రద్దు
ప్రత్యేక రైళ్ల వేళలు & షెడ్యూల్

- తిరుపతి - నాగర్‌సోల్ ప్రత్యేక రైలు (నం. 07427):ఆగస్టు 23వ తేదీన ఉదయం 03:30 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు (ఆగస్టు 24) ఉదయం 08:00 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది.
- నాగర్‌సోల్ - తిరుపతి ప్రత్యేక రైలు (నం. 07428):ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 02:30 గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి, మరుసటి రోజు (ఆగస్టు 27) సాయంత్రం 06:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
రైలు వెళ్లే మార్గం & ప్రధాన స్టేషన్లు
ఈ ప్రత్యేక రైలు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా కింది ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణ, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నిజామాబాద్, బాసర, ముడ్కేడ్, నాందేడ్, పూర్ణా, పర్బని, జల్నా, ఛత్రపతి శంభాజీ నగర్.
Tirupati Shirdi Special Trains: వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్‌డేట్
- ముంబై - బెంగళూరు వందే భారత్ స్లీపర్: ఈ నూతన రైలును ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిపిస్తూ, భక్తుల సౌకర్యార్థం పుట్టపర్తి (సత్యసాయి ప్రశాంతి నిలయం) లో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
- సికింద్రాబాద్ - ఢిల్లీ సర్వీసు: తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే కొత్తగా సికింద్రాబాద్ - ఢిల్లీ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

