Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

బస్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

వార్త 1 week ago

'తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ'

Telangana Formation Day Celebrations: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నడుపుతూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై.

నాగిరెడ్డి. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు చారిత్రాత్మక చేయూత. బస్సుల్లో రద్దీ పెరిగినప్పటికీ అద్భుతంగా సేవలందిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు మరియు సిబ్బందికి ఎండీ నాగిరెడ్డి ప్రత్యేక అభినందనలు. “ప్రయాణికుల భద్రతే మన ప్రథమ కర్తవ్యం” ప్రతి ప్రయాణికుడిని కుటుంబ సభ్యుడిగా భావించి సేవలు అందించాలని సిబ్బందికి పిలుపు.

Read Also : Telangana Formation Day: ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్!

 Telangana formation celebrations at Bas Bhavan

Telangana Formation Day Celebrations: “కార్మికుల సంక్షేమానికి పూర్తి భరోసా”

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆర్టీసీ బస్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వై. నాగిరెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలంగా సిద్ధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరిస్తూ, వారికి ఎండీ నాగిరెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ జెండా అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది కోట్ల మంది ఆత్మగౌరవ నినాదం మరియు లక్షలాది మంది పోరాటాల స్వేచ్ఛా గీతం” అని కొనియాడారు. ప్రగతిని సాధించడంలోనూ దేశంలోనే సాటిలేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అన్ని రంగాల్లో సాధించిన అద్భుత ప్రగతిలో మన తెలంగాణ ఆర్టీసీ కూడా ఒక ముఖ్యమైన భాగస్వామి కావడం మనందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఒకనాడు ఎన్నో సవాళ్లతో ఉన్న మన సంస్థ, నేడు ప్రజా రవాణాలో దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది అంటే దానికి కారణం మన ఉద్యోగుల క్రమశిక్షణ, కష్టం మరియు నిబద్ధత మాత్రమేనని అభినందించారు.

ముఖ్యంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం సంస్థ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిందని నాగిరెడ్డి వివరించారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది మహిళలు, విద్యార్థినులు, మరియు ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో మహిళల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే మహిళలకు రవాణా భారాన్ని తగ్గించడమే కాకుండా వారి ఉపాధి, విద్యా అవకాశాలను మెరుగుపరిచేలా ఈ పథకాన్ని రూపొందించారని తెలిపారు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల నుండి అద్భుతమైన స్పందన లభించిందని, సంస్థ ఇప్పటికే విజయవంతంగా 10వేల కోట్ల ఉచిత మహిళా ప్రయాణాలను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని వెల్లడించారు. దీనితో పాటు మహిళా సంఘాలకు బస్సులు కేటాయించడం ద్వారా వారు ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ సేవలని మరింత ఆధునీకరిస్తున్నామని ఎండీ వై. నాగిరెడ్డి గారు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను ధ్యేయంగా పెట్టుకుని, కాలుష్య నివారణ కోసం పెద్ద ఎత్తున అధునాతన ఎలక్ట్రిక్ బస్సులను (e-buses) మరియు సరికొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను అత్యంత విజయవంతంగా నడుపుతూ తెలంగాణ ఆర్టీసీ అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచిందని గర్వంగా ప్రకటించారు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపులు, లైవ్ బస్ ట్రాకింగ్ వంటి ఆధునిక సాంకేతిక మార్పులను సంస్థలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు నాగిరెడ్డి స్పష్టం చేశారు. బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగినప్పటికీ, డ్రైవర్లు, కండక్టర్లు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ఎంతో ఓపికతో, బాధ్యతాయుతంగా సేవలు అందిస్తూ మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు అని ఎండీ నాగిరెడ్డి కొనియాడారు.

సంస్థ ఎదుగుదలతో పాటు కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల శ్రేయస్సును కాపాడటంలో, వారి జీతభత్యాలు మరియు ఇతర ప్రయోజనాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ మనకు ఆర్థికంగా, నైతికంగా అండగా నిలుస్తోందని,భవిష్యత్తు లో కూడా కార్మికుల సంక్షేమానికి ఎలాంటి లోటు రానివ్వమని ఈ వేదికగా స్పష్టం చేశారు. “ప్రయాణికుల భద్రతే మన ప్రథమ కర్తవ్యం” అని, ప్రమాద రహిత ప్రయాణాన్ని అందించడమే మన ఏకైక లక్ష్యం కావాలని ఎండీ ఉద్ఘాటించారు. బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుడిని మన కుటుంబ సభ్యుడిగా భావించి, మర్యాదపూర్వకమైన సేవలు అందించినప్పుడే ప్రజల్లో సంస్థపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లను అధిగమిస్తూ, లాభాల బాటలోకి పయనిస్తూ, తెలంగాణ ప్రజల గుండెల్లో నమ్మకమైన రవాణా వారధిగా తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు మనమంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈడీ శ్రీ. సిహెచ్.వెంకన్న, ఫైనాన్సియల్ అడ్వైజర్ శ్రీమతి విజయ పుష్ప , సిటీఎం శ్రీ. శ్రీధర్,సిపిఎం శ్రీమతి ఉషాదేవి, సిటీఎం ట్రాఫిక్ శ్రీమతి శ్రీదేవి, శ్రీమతి కవిత , శ్రీమతి ప్రభులత పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ భవన్‌లో రాష్ట్రా ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha