Secunderabad JBS RTC Bus Accident: హైదరాబాద్ నగరంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ (జేబీఎస్) సమీపంలో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బీభత్సం సృష్టించింది.
ప్రయాణికులు, వాహనదారుల మీదికి బస్సు దూసుకెళ్లడంతో అక్కడ కాసేపు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Biker stuck under bus.. narrowly missed fatal accident
Secunderabad JBS RTC Bus Accident: బస్సు చక్రాల కింద బైకర్!
వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సు జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బస్టాప్ వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఊహించని ప్రమాదంలో శివ అనే బైకర్ తన బైక్‌తో సహా ఆర్టీసీ బస్సు ముందు చక్రాల కింద ఇరుక్కుపోయాడు.
క్రేన్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్
ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించి, బస్సు కింద ఇరుక్కుపోయిన శివను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ బస్సు బరువు ఎక్కువగా ఉండటంతో అతడిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన ఒక క్రేన్‌ను అక్కడికి రప్పించారు. క్రేన్ సహాయంతో బస్సును పైకి లేపి, పక్కకు జరిపిన తర్వాత బైక్‌తో పాటు తీవ్రంగా గాయపడిన బాధితుడు శివను సురక్షితంగా బయటకు తీశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
ఢిల్లీ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం.. 21 కి చేరిన మృతుల సంఖ్య

