Dailyhunt
బస్సు ప్రమాదం: 14 మంది మృతికి ఆ 'పిసినారితనమే' కారణం

బస్సు ప్రమాదం: 14 మంది మృతికి ఆ 'పిసినారితనమే' కారణం

వార్త 2 weeks ago

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఈ భయంకరమైన బస్సు ప్రమాదానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

కేవలం కొద్దిపాటి లాభం కోసం, నిబంధనలను తుంగలో తొక్కి 14 మంది ప్రాణాలను బలిగొన్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నెల (మార్చి) 26న రాయవరం సమీపంలో జరిగిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తు ముగిసింది. ఈ కేసులో బస్సు యజమాని హరికృష్ణారెడ్డి, డ్రైవర్ యువరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదం వెనుక కేవలం సాంకేతిక లోపమే కాకుండా మానవ తప్పిదాలు, యజమాని అత్యాశ కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

Read Also:Medchal Doctor Suicide: భార్య వేధింపులు భరించలేక..డాక్టర్ ఆత్మహత్య

Markapuram Bus Accident: విచారణలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు:

ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్న యువరాజ్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నిపుణులైన డ్రైవర్లకు ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో, యజమాని లైసెన్స్ లేని వ్యక్తిని తక్కువ జీతానికి నియమించుకున్నాడు.ఎనిమిది నెలల క్రితం కొనుగోలు చేసిన ఈ సెకండ్ హ్యాండ్ బస్సు కండిషన్ ఏమాత్రం బాగోలేదు. తరచూ మరమ్మతులు వస్తున్నా, లాభాల కోసం యజమాని అలాగే నడిపించాడు.

 Markapuram Bus Accident Investigation Updates

వాహనం పరిస్థితి సరిగా లేకపోవడంతో, పోలీసులు తనిఖీ చేస్తారన్న భయంతో లేదా రిపేర్ల భయంతో వినుకొండ మీదుగా వెళ్లాల్సిన బస్సును జాతీయ రహదారి వైపు మళ్లించారు.అతివేగంతో వెళ్తున్న బస్సును డ్రైవర్ అజాగ్రత్తగా కుడివైపునకు మళ్లించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ డీజిల్ ట్యాంక్‌ను బస్సు బలంగా ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగడంతో, నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి.

ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాణాలు కాపాడింది

ఈ ఘోర అగ్నిప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, బస్సులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit) డోర్ సకాలంలో తెరుచుకోవడంతో సుమారు 20 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగలిగారు. లేనిపక్షంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండేదని అధికారులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రేపు ఢిల్లీలో ప్రధాని మోడీతో లోకేశ్ భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha