Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

వార్త 1 week ago

Ebola Virus Outbreak: ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ వైరస్ వ్యాప్తి రేటు అసాధారణంగా పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత కేసులు నమోదు కాగా, అందులో 88 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత అవసరమని గుర్తిస్తూ, WHO ఈ పరిస్థితిని "పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్" (అంతర్జాతీయ ప్రాధాన్యత గల ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి) గా ప్రకటించింది.

Read Also :Donald Trump Taiwan Comments: చైనాతో పెట్టుకుంటే రక్షించలేమంటూ ఓపెన్ స్టేట్మెంట్!

Ebola Virus Outbreak:రంగంలోకి అంతర్జాతీయ వైద్య బృందాలు

ఈ ప్రత్యేక ప్రకటన ద్వారా ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు గ్లోబల్ లెవెల్‌లో తక్షణ సహాయం అందే మార్గం సుగమమైంది. వైరస్ నిర్మూలనకు అవసరమైన నిధులు, అత్యవసర వ్యాక్సిన్లు మరియు అంతర్జాతీయ వైద్య నిపుణుల సేవలు బాధిత దేశాలకు వేగంగా చేరనున్నాయి. అయితే, ఎబోలా అత్యంత వేగంగా సంక్రమించే వ్యాధి కావడంతో, అంతర్జాతీయ సరిహద్దుల గుండా ఇది ఇతర దేశాలకు పాకకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులపై కఠిన నిఘా ఉంచాలని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బస్సును ఢీకొట్టిన రైలు.. !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha