Jubilee Hills: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఒక బిఎండబ్ల్యూ (BMW) కారు డ్రైవర్ ఏకంగా స్పై సినిమాల్లో మాదిరిగా నంబర్ ప్లేట్ మార్చే సాంకేతికతను వాడి పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టాడు.
అయితే, మద్యం మత్తులో దొరికిపోయిన సదరు డ్రైవర్ ప్లాన్ అడ్డంగా తిరగబడింది.
Read Also :Hyderabad: వాటర్ కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్ వస్తే క్లిక్ చేయకండి: సీపీ సజ్జనార్
తనిఖీల్లో దొరికిపోయిన వైనం
శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లో ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్‌కు చెందిన గౌతమ్ అనే వ్యక్తి తన బిఎండబ్ల్యూ కారులో వెళ్తుండగా పోలీసులు ఆపారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతనికి 137 BAC లెవల్ ఉన్నట్లు తేలింది. మద్యం మత్తులో ఉన్న గౌతమ్ పోలీసులకు తన వివరాలు చెప్పడానికి నిరాకరించి మౌనంగా ఉండిపోయాడు.
Jubilee Hills: పొరపాటున నొక్కిన బటన్.. బయటపడ్డ అసలు రంగు
కారు ట్రాఫిక్‌కు అడ్డుగా ఉండటంతో, దానిని పక్కకు పార్క్ చేయడానికి ఒక కానిస్టేబుల్ డ్రైవింగ్ సీటులో కూర్చున్నారు. అది ఆటోమేటిక్ కారు కావడంతో, డ్రైవింగ్ వీల్‌కు కుడివైపున ఉన్న ఒక బటన్‌ను కానిస్టేబుల్ పొరపాటున నొక్కారు. అంతే.. ఒక్క క్షణంలో కారు ముందున్న నంబర్ ప్లేట్ మారిపోయింది!
పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా..
- కారు ముందు వైపు DL 6 CM 7079 అని ఉంది.
- కారు వెనుక వైపు TSFQ 9999 అని ఉంది. వెంటనే ఇంజిన్, ఛాసిస్ నంబర్లను తనిఖీ చేసిన పోలీసులు, అసలు నంబర్ DL 6 CM 7079 అని నిర్ధారించారు.
చట్టపరమైన చర్యలు
పోలీసులను మోసం చేసేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసినందుకు గౌతమ్‌పై జూబ్లీహిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. “కేవలం చలాన్ల నుంచి తప్పించుకోవడమే కాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఈ సాంకేతికతను వాడటం తీవ్రమైన నేరం” అని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రవీందర్ తెలిపారు. కారును సీజ్ చేసిన పోలీసులు నిందితుడిపై విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
బిగ్‌బాస్ ఫేమ్ విష్ణుప్రియపై పోలీస్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

